Mohan Babu About Vishnu : విష్ణుని గెలిపించండి... ఏ సమస్య వచ్చిన ముందుంటాడు : మోహన్ బాబు
Mohan Babu About Vishnu : వాళ్లు ఒకటంటే.. వీళ్లు రెండంటారు.. అవతలి వాళ్లు విమర్శలతో విరుచుకుపడుతుంటే వీళ్లు కౌంటర్లతో కడిగిపారేస్తున్నారు.. అవును, మా ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరింది.. తారల మాటల యుద్ధానికి మరికొద్ది గంటల్లో తెర పడనుంది.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లు విజయం కోసం ఆఖరాట మొదలు పెట్టాయి. రేపు జరిగే మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరి ప్యానెల్ విజయం సాధించబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
900 మంది సభ్యులు.. అందులో ఓటేసే వాళ్లెంతమందో తెలియదు.. ఎవరు గెలిచినా గొప్పగా చెప్పుకునేంత పరిస్థితీ ఉండదు.. అయితే, ఇదంతా గతం.. ఇప్పుడు మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.. పోలింగ్‌కు కొద్ద గంటలే సమయం ఉండటంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.. మ్యాగ్జిమమ్ ఓట్లు పోలయ్యేలా రెండు ప్యానెళ్లు ప్లాన్ చేస్తున్నాయి.. అవసరమైతే ఖర్చులు భరించయినా సరే సభ్యులతో ఓటు వేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు వందలకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌కు మెగా కుటుంబం మద్దతు ఇవ్వగా.. మంచు విష్ణుకు ఆయన తండ్రి మోహన్‌బాబుతోపాటు కొంతమంది సీనియర్లు సపోర్టు చేస్తున్నారు.. తనయుడి విజయం కోసం మోహన్‌బాబు బాగానే కష్టపడుతున్నారు. నిన్న మోహన్ బాబు రాసిన లెటర్ హాట్ టాపిక్‌గా మారగా.. తాజాగా ఓ ఆడియో మెసేజ్ కూడా విడుదల చేశారు.. ఏ సమస్య వచ్చినా విష్ణు ముందుంటారని.. మా అధ్యక్షుడిగా విష్ణుని గెలిపించాలని మోహన్‌బాబు కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com