Manchu Vishnu On Pawan :పవన్ ఫ్యామిలీ ఫ్రెండ్... ప్రొటోకాల్ కారణంగా స్టేజీ మీద మాట్లాడుకోలేదు అంతే...!

Manchu Vishnu On Pawan : మా ఎన్నికలప్పుడు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రకాష్‌రాజ్ హ్యాపీగా చూసుకోవచ్చన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. బ్యాలెట్ బాక్సుల్లో ఏం తేడా జరిగిందో ప్రకాష్‌రాజ్‌కే తెలియాలన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయకముందే మా గెలుపును ప్రకాష్‌రాజ్ ఒప్పుకున్నారని కామెంట్ చేశారు.
ఎన్నికల సమయంలో రెండు వైపులా చిన్నచిన్న గొడవలు జరిగి ఉండొచ్చు గాని.. మేం మాత్రం ప్రజాస్వామ్యయుతంగా గెలిచామన్నారు. ఈసారికి తమ ప్యానెల్ గెలిచిందని, వచ్చేసారి ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి ఆల్‌ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌లో ఒక్కరి నుంచే రాజీనామా లేఖ వచ్చిందన్నారు మంచు విష్ణు.
అలయ్ బలయ్‌లో పవన్ కల్యాణ్ తనతో మాట్లాడలేదన్న ప్రచారాన్ని ఖండించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ప్రొటోకాల్ కారణంగా స్టేజీ మీద మాట్లాడుకోలేదని.. కాని, స్టేజ్ కింద ఇద్దరం మాట్లాడుకున్నామన్నారు. పవన్‌తో తాను మాట్లాడింది మాత్రం మీడియా షూట్ చేయలేదన్నారు. పవన్ కల్యాణ్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. మోహన్‌బాబు, చిరంజీవి సైతం ఇదివరకే మాట్లాడుకున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com