Manchu Vishnu on Naga Babu : సూపర్ డైలాగ్..నా సినిమాల్లో వాడుకుంటా.. నాగబాబుకి విష్ణు కౌంటర్..!

Manchu Vishnu on Naga Babu : సూపర్ డైలాగ్..నా సినిమాల్లో వాడుకుంటా.. నాగబాబుకి విష్ణు కౌంటర్..!
X
Manchu Vishnu on Naga Babu : 'మా' ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌గా మారాయి.. అధ్యక్ష్య పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Manchu Vishnu on Naga babu : 'మా' ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌గా మారాయి.. అధ్యక్ష్య పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నువ్వా నేనా అంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌‌కి మద్దతిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్ పైన మంచు విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. 'పవన్‌కల్యాణ్‌కి కోపం వస్తే వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది' అంటూ నాగబాబు చేసిన ఓ కామెంట్‌పై విష్ణు సెటైర్‌ వేశారు. ఈ డైలాగ్ బాగుందని తన తదుపరి చిత్రాలలో దీనిని వాడుకుంటానని అన్నారు విష్ణు. ఇక ఈసారి జరగబోయే ఎన్నికలు ఆత్మగౌరవానికి సంబంధించినవి అని అన్నారు విష్ణు.

"నా ప్రత్యర్థిగా తెలుగు వ్యక్తి కాదు. అతని పేరు పలకడం కూడా నాకిష్టం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలయ్యాడు. చిత్రపరిశ్రమలో ఎన్నో సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరించాడని ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి తరుపున అతడికి సమాధానం చెప్పడానికి నేనొక్కడిని చాలు.. అతను ఇప్పటికే నా కుటుంబం పైన చాలా ఆరోపణలు చేశాడు. అతను ఇక్కడివాడు కాదు.. నా కుటుంబం గురించి ఏమీ తెలియదు కాబట్టి క్షమించి వదిలేశాను. ఇప్పుడు సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే ఇప్పుడు కామెంట్ చేయమనండి.. నేను అంటే ఏంటో చూపిస్తా " అంటూ సవాల్ విసిరారు విష్ణు.

Tags

Next Story