మా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన మంచు విష్ణు ప్యానెల్‌

మా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన మంచు విష్ణు ప్యానెల్‌
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ - మా ఎన్నికల మ్యానిఫెస్టోను మంచి విష్ణు ప్యానెల్‌ విడుదల చేసింది.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ - మా ఎన్నికల మ్యానిఫెస్టోను మంచి విష్ణు ప్యానెల్‌ విడుదల చేసింది. మా ఎన్నికల నేపథ్యంలో తన ప్యానెల్‌ లో పోటీచేస్తున్న వారితో కలిసి మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు మాట్లాడుతూ... మా అధ్యక్ష పదవి అనేది బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యం, విద్య తన ప్రథమ ప్రాధాన్యాలని పేర్కొన్నారు. సినీ కార్మికులందరికీ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రచ్చ జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అవకాశాలు రావాలన్నదే తన ఉద్దేశ్యమని తెలిపారు మంచు విష్ణు.

Tags

Read MoreRead Less
Next Story