మహేష్ బాబు అందంపై మంచు విష్ణు కామెంట్స్..

మహేష్ బాబు అందంపై మంచు విష్ణు కామెంట్స్..
ఓ సందర్భంలో రామ్ చరణ్ కూడా మహేష్ బాబు నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగితే

తెలుగు ఇండస్ట్రీలో అందమైన హీరో అంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. సాటి హీరోలు కూడా మహేష్ బాబు అందానికి ఫిదా అవుతారు. ఒకప్పుడు నవ మన్మధుడు నాగార్జున అందగాడి లిస్ట్‌లో ఉంటే.. ప్రస్తుతం మహేష్‌కి జై కొడుతున్నారు. ఓ సందర్భంలో రామ్ చరణ్ కూడా మహేష్ బాబు నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగితే అందం అని సమాధానం చెప్పాడు. ఎన్టీ అర్ నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు కూడా మహేష్ బాబు అందంపై కామెంట్ చేశాడు.

నిన్న రాత్రి మంచు విష్ణు భార్య విరానికా పుట్టిన రోజు వేడుక జరిగింది. దీనికి మహేష్ బాబు, భార్య నమ్రత శిరోద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులతో తీసుకున్న ఫోటోను మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో మహేష్ అందాన్ని కొనియాడారు విష్ణు. ఈ ఫోటోలోని ఓ వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిలా మారిపోతున్నాడు. రోజు రోజుకి మరింత అందంగా తయారవుతున్నాడు. దీనికి ఆయన మంచి తనం, దయా హృదయమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

విష్ణు ట్వీట్‌కి స్పందించిన మహేష్.. వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి హీరో గోపీ చంద్ కూడా హాజరయ్యారు. కాగా మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా చేస్తుండగా, విష్ణు 'మోసగాళ్లు', గోపీచంద్ 'సిటీమార్' చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story