Manchu Vishnu: రాయలసీమ కుర్రాడిగా మంచు విష్ణు.. నాలుగు భాషల్లో చిత్రం..

Manchu Vishnu: రాయలసీమ కుర్రాడిగా మంచు విష్ణు.. నాలుగు భాషల్లో చిత్రం..
Manchu Vishnu: మంచు విష్ణు తన కెరీర్‌లోని 19వ చిత్రాన్ని చాలా క్రియేటివ్‌గా అనౌన్స్ చేశాడు.

Manchu Vishnu: గత కొన్నాళ్లుగా హీరో మంచు విష్ణు.. సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించాడు. రెండేళ్లకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదే గ్యాప్‌లో ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడితో పోటీపడి 'మా'కు అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు మా వ్యవహారాలతోనే తను బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నాడు మంచు విష్ణు.

ఇక చాలాకాలం తర్వాత మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రమే 'గాలి నాగేశ్వర రావు'. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే తన తరువాతి మూవీ అప్డేట్‌ను చాలా క్రియేటివ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మంచు విష్ణు.

మంచు విష్ణు తన కెరీర్‌లోని 19వ చిత్రాన్ని చాలా క్రియేటివ్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు పనిచేసే వారెవరో అందరినీ పరిచయం చేస్తూ.. మీరు మా ప్రెసిడెంట్ కదా.. మీరు హీరోగా సినిమా ఏంటి అని అడిగిన వారికి మా ప్రెసిడెంట్ అంటే ఇండియా ప్రెసిడెంటా సినిమాలు చేయకూడదా అంటూ గట్టి సమాధానమే ఇచ్చాడు విష్ణు. ఈ సినిమాకు 'జిన్నా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతే కాకుండా తిరుపతి కొండల నుండి ఈ టైటిల్ రావడం వల్ల ఇందులో రాయలసీమ కుర్రాడిగా మంచు విష్ణు నటిస్తున్నాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story