Manchu Vishnu : చిరంజీవి నన్ను విత్‌డ్రా చేసుకోమన్నారు: మంచు విష్ణు
Manchu Vishnu : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది. ఆ ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత మా కి రాజీనామాల పర్వం మొదలైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా.. నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు.
ఇదిలావుండగా తాజాగా జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగబాబు, ప్రకాశ్ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. తొందరపడి ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్న దీనిని అంగీకరించనని, త్వరలో వెళ్లి నాగబాబుతో ఈ విషయం గురించి మాట్లాడుతానని అన్నారు.
నాగబాబు మా కుటుంబంలో సభ్యుడేనని అన్నారు. అటు ప్రకాష్ రాజ్ తో కూడా చర్చిస్తానని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన వారిని కలుపుకొని పోతామని, తామంతా ఒకటేనని చెప్పుకొచ్చారు. మా ప్యానల్‌లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. అటు మా ఎన్నికల్లో విత్ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని నాన్నని కూడా అడిగారిని.. అయితే పోటీ ఉండాలని నాన్న అనుకోవడంతో బరిలో నిలిచానని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com