Manchu Vishnu on Ram Charan : రామ్ చరణ్ నాకు ఓటేయలేదు : విష్ణు

Manchu Vishnu on Ram Charan : రామ్ చరణ్ తనకు ఓటేయలేదన్న మంచు విష్ణు కామెంట్స్ తో మెగా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. చరణ్.. ప్రకాశ్ రాజ్ కే ఓటేశారన్న మంచు విష్ణు కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ పాయింట్ గా మారింది. ఎందుకంటే ఎవరు ఎవరికి ఓటేస్తారో ఎవరికీ తెలియదు. సాధారణంగా ఓటేసేవారు కూడా చెప్పరు. కానీ ఇప్పుడు విష్ణు ఇలా అనడం సంచలనంగా మారింది.
రామ్ చరణ్.. మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగానే ఉంటారు. వాళ్లు, వీళ్లు కలుస్తూనే ఉంటారు. కానీ మా ఎన్నికలు మాత్రం వీరిని రెండు వర్గాలుగా మార్చేసింది. మెగా ఫ్యామిలీ డైరెక్ట్ గా ప్రకాశ్ రాజ్ కే సపోర్ట్ చేయడంతో .. ఆ ఓట్లన్నీ అటే పడ్డాయన్నది విష్ణు భావన కావచ్చు. కానీ.. ఇప్పుడీ సందర్భంలో ఇలా అనడంతో అది సంచలనంగా మారింది.
రామ్ చరణ్ ఓటేయడానికి వచ్చినప్పుడు కూడా రెండు ప్యానళ్లను కలిశారు. అందరితోనూ మాట్లాడారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి కాని, పవన్ కల్యాణ్ కాని మోహన్ బాబుతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో మోహన్ బాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భుజం పైన చేతులు వేసి ఆప్యాయంగా మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ ఓటుపై మంచు విష్ణు కామెంట్స్ తో మెగా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com