Manchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..

Manchu Vishnu: మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయాలను తలపించేలా మా ఎన్నికలు నడిచాయి. అందులో మంచు విష్ణు పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచాడు. అప్పటినుండి నెట్టింట్లో మంచు విష్ణుపై ఫోకస్ ఎక్కువయ్యింది. అప్పటినుండి తను ఏం చేసినా.. ప్రేక్షకులు దానిని కామెంట్ చేయకుండా ఉండడం లేదు. అలాగే తాజాగా మంచు విష్ణు చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
మంచు విష్ణు తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినా.. ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచపోయేది మాత్రం 'ఢీ'. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ చాలామంది ఫేవరెట్. అయితే దీనికి సీక్వెల్ ప్లాన్ చేసిన శ్రీను వైట్ల.. మళ్లీ ఏమైందో వెనక్కి తగ్గాడు. అయితే తాజాగా మంచు విష్ణు, జెనీలియా కలిశారు. వారు కలిసినప్పుడు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'ఢీ' మూవీలోని ఓ స్టిల్‌తో ఫోటో దిగారు మంచు విష్ణు, జెనీలియా. దీనిని ట్వీట్ చేస్తూ.. 'అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు' అని క్యాప్షన్ పెట్టాడు విష్ణు. అయితే దీనికి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఢీకి సీక్వెల్ చేస్తున్నట్టుగా నిర్ధరించేస్తున్నారు. ఎలాగో ఇన్నాళ్ల తర్వాత జెనీలియా రీ ఎంట్రీ ఇస్తుండగా.. ఢీకి సీక్వెల్ ఉండబోతుందని ఆశిస్తున్న అభిమానులకు విష్ణు ఏం సమాధానం చెప్తాడో చూడాలి.
My Tinker bell and me. Nothing has changed since we met @geneliad ❤️
— Vishnu Manchu (@iVishnuManchu) May 22, 2022
Powerful Bond, forever 💪 pic.twitter.com/62gTYC4JlG
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com