Jabardasth: 'జబర్దస్త్' షోకు కొత్త యాంకర్.. అనసూయ ప్లేస్‌లో ఆమె..

Jabardasth: జబర్దస్త్ అనే కామెడీ షో.. తెలుగులో స్టాండప్ కామెడీకే ప్రాణం పోసింది. దీని ద్వారా పేరు సంపాదించుకున్న తర్వాత ఎంతోమంది కమెడియన్లకు సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో.. చాలామంది కమెడియన్లు ఒక్కొక్కరిగా షోను వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఈ షోను వీడారు. ఇంతలోనే యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకుంది.
అనసూయ, రష్మీ.. ఈ ఇద్దరు జబర్దస్త్‌కు రాకముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు. కానీ అవేవి వారి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. కానీ జబర్దస్త్ ద్వారా వీరిద్దరికీ చాలా గుర్తింపు లభించింది. ప్రస్తుతం వీరి పేరు చెప్తే గుర్తుపట్టని వారుండరు. అయినా కూడా అనసూయ ఈ షోను వదలడానికి డిసైడ్ అయ్యింది. ఇతర ఛానెళ్లల్లో వేరే ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరి అనసూయ.. జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోతే తన స్థానంలో ఎవరు వస్తారు అనేది ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా తెరపై మంజూష రాంపల్లి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మంజూష కూడా ఎంతోకాలంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్నా.. ఎక్కువగా గుర్తింపు సాధించలేకపోయింది. కానీ ఇటీవల హాట్ ఫోటోషూట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించి ఈవెంట్స్‌తో బిజీ అయ్యింది. అందుకే జబర్దస్త్ మేకర్స్ కూడా అనసూయ స్థానంలో తనను తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com