Manoj Marriage: మంచు వారి "పెళ్లి సందడి"

మంచు వారింట మళ్లీ పెళ్లి భాజాలు మోగనున్నాయి. మనోజ్ వివాహ వేడుకకు ఏర్పాట్లు మొదలయ్యాయి. దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి తనయ భూమా మౌనికా రెడ్డితో మనోజ్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. అయితే మరి కొన్ని రోజుల్లోనే ఇరువురి వివాహ వేడుక అంగరంగవైభవంగా జరగనుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని మంచు లక్ష్మీ అన్నీ తానై ముందుకు నడిపించారని వినిపిస్తోంది. మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మనోజ్ 2016లో ప్రణతిని వివాహం చేసుకున్నారు. 2019లో ఇరువురికీ విడాకులు మంజూరు అయ్యాయి. మరోవైపు మౌనిక కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. ఇక కెరీర్ పరంగా కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న మనోజ్ త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వాట్ ద ఫిష్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు రాజకీయాల్లోనూ మనోజ్ కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏమైనా మౌనికతో కొత్త జీవితం ఆరంభిస్తోన్న మనోజ్ అన్నింటా రాణించాలని ఆశిద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com