మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!

మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!
మరి ఇంతటి భారాన్ని భుజాలకు ఎత్తుకున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత పుచ్చుకుంటాడనే డౌట్ అందరికీ వస్తుంది.

ఆయన హావ భావాలు తాతను గుర్తుకు తెస్తాయి. ఆయన డైలాగ్ డెలివరీ నందమూరి నటవారసుడికి అలవోకగా అబ్బాయి. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వెండితెరమీద వెలిగిపోతూ.. బుల్లితెర ప్రేక్షకులను మురిపిస్తూ మరోసారి హోస్ట్ చేయడానికి మనముందుకు వచ్చేస్తున్నాడు తారక్..

ఇప్పటికే బిగ్‌బాస్ షో ద్వారా బోలెడంత ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. మీలో ఎవరు కోటీశ్వరుడి ద్వారా మరింత బజ్ క్రియేట్ చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమో ద్వారా హైప్ తెచ్చుకున్నాడు.

ఇక ఈ షో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూసేలా చేశాడు. మరి ఇంతటి భారాన్ని భుజాలకు ఎత్తుకున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత పుచ్చుకుంటాడనే డౌట్ అందరికీ వస్తుంది. సింపుల్‌గా ఒక ఎపిసోడ్‌కి ఒక కోటి రూపాయల పైనే తీసుకోబోతున్నాడు తారక్.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ షో ఇప్పుడు వస్తోంది. విజ్ఞానం, వినోదం కలగలిసిన ఈ షో ప్రేక్షకాదరణను చూరగొంటుంది. ఆ నమ్మకంతోనే షో నిర్వాహకులు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు.

Tags

Read MoreRead Less
Next Story