Meena: భర్త మరణం తర్వాత తొలిసారి సినిమా సెట్స్‌లో మీనా.. వీడియో వైరల్..

Meena: భర్త మరణం తర్వాత తొలిసారి సినిమా సెట్స్‌లో మీనా.. వీడియో వైరల్..
Meena: మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మరణించారు. ఆయన మరణానికి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశాయి.

Meena: సినిమా వారి జీవితం గురించి చాలామంది చాలా అనుకుంటారు. కానీ వారి పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. కమిట్మెంట్స్ వల్ల ఒక్కొక్కసారి తప్పకుండా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే నటి మీనా కూడా తన జీవితంలో జరిగిన విషాదం గురించి బయటికి రావడానికి షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది.

మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మరణించారు. ఆయన మరణానికి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశాయి. అంతే కాకుండా తన భర్త మరణం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తుండగా.. మీనా వాటిని ఖండించింది. కొన్ని రోజుల క్రితం విద్యాసాగర్‌ను గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది మీనా.

ప్రస్తుతం ఎస్వీ కృష్టా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే సినిమాలో మీనా నటిస్తోంది. ఈ మూవీలో మీనాతో పాటు ఆలీ, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ సెట్‌లో ఆయన బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆలీ భార్య తన యూట్యూబ్ ఛానెళ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మీనాను చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story