Meena: మాకిప్పుడు ఇది చాలా అవసరం: మీనా

Meena: సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్.. ఇటీవల మృతిచెందడం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను కలచివేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనా.. భర్త మరణం తర్వాత నుండి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. విద్యాసాగర్ మరణించిన తర్వాత ఓ తన భర్త మరణంపై ఎలాంటి ఫేక్ న్యూస్‌లు వ్యాప్తి చేయవద్దు అని పోస్ట్ చేసిన మీనా.. ఇటీవల మరో పోస్ట్ షేర్ చేసింది.
మీనా.. హీరోయిన్‌గా సినిమాలు చేయకపోయినా.. ఇండస్ట్రీకి దూరంగా మాత్రం తాను ఎప్పుడూ లేదు. ఇప్పటికీ పలు మలయాళ, తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. మీనా మాత్రమే కాకుండా తన వారసురాలిగా కూతురు నైనికాను కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే భర్త మృతితో మీనా జీవితంలో తీరని లోటు మిగిలింది.
ఇటీవల మీనా తన భర్త ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా షేర్ చేసింది. 'మీరు మాకు దొరికిన అందమైన వరం కానీ తొందరగా దూరమయిపోయారు. మీరెప్పటికీ మా మాదిలో నిలిచిపోతారు. ఇంత ప్రేమను, దీవెనలను పంపిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మంచి మనసులకు నేను, నా కుటుంబం థాంక్యూ చెప్పుకుంటున్నాం. మాకిప్పుడు అవన్నీ చాలా అవసరం. మాకు సపోర్ట్ చేస్తూ, ప్రేమను చూపించే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉన్నందుకు రుణపడి ఉంటాం. మీ ప్రేమ మాకు తెలుస్తోంది' అని పోస్ట్ చేశారు మీనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com