Megastar: అనురాగ్ ఠాకూర్‌తో మెగాస్టార్ భేటీ

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో అధికారికంగా కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. కాసేపు ముచ్చటించారు. చిరంజీవితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటుడు నాగార్జున కూడా ఈ భేటీలో భాగమయ్యారు. ఠాకూర్‌కు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ గౌరవ మర్యాదలతో సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి వారితో చర్చించారు మంత్రి అనురాగ్. ఈ మేరకు కేంద్ర మంత్రితో దిగిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమతో గడిపినందుకు అనురాగ్ ఠాకూర్‌కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వేగవంతమైన పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలిసి జరిపిన చర్చ తనకు ఎంతో నచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో ఖాతా తెరచినప్పటి నుంచి మెగాస్టార్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com