మెగా ఫ్యాన్స్ కి షాక్.. 'ఆచార్య' విడుదల వాయిదా..!

మెగా ఫ్యాన్స్ కి షాక్.. ఆచార్య విడుదల వాయిదా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైనా కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

ముందుగా ఈ సినిమాని మే 13న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా దృష్ట్యా సినిమా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితులు చక్కబడ్డాక విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపింది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story