Acharya Teaser : చిరంజీవి 'ఆచార్య' టీజర్‌ వచ్చేసింది!

Acharya Teaser : చిరంజీవి ఆచార్య టీజర్‌ వచ్చేసింది!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది. " ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ రామ్ చరణ్ వాయిస్ తో మొదలైన చిత్ర టీజర్... ఆసక్తికరంగా సాగింది. చిరు లుక్, డైలాగ్ డెలివరీ ఇంకో లెవెల్ లో ఉన్నాయి.

'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో' అంటూ చివరిలో చిరు చెప్పిన డైలాగ్ టీజర్ కి మెయిన్ హైలెట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాలో చిరు దేవాలయాల పై జరిగే అన్యాయాల పై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తిరు సినిమాటోగ్రాఫీ, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story