మెగాస్టార్ ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి ఇతనే.. !

మెగాస్టార్ ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి ఇతనే.. !
లేట్‌‌‌‌‌గా వచ్చిన చాలా లేటెస్ట్‌‌‌గా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్‌లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే అందరినీ అవాక్కయ్యేలా చేశారు చిరు.

లేట్‌‌‌‌‌గా వచ్చిన చాలా లేటెస్ట్‌‌‌గా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్‌లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే అందరినీ అవాక్కయ్యేలా చేశారు చిరు. సెటైర్లు, కామెడీ టైమింగ్‌లతో చిరు చేసిన ట్వీట్లు వైరల్‌‌‌గా మారాయి. ఇక ఫాలోయింగ్ విషయంలో కూడా చిరు రికార్డు సృష్టించాడు. ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన మొదట్లో చిరంజీవి.. తన తనయుడు రామ్ చరణ్ ఒక్కడినే ఫాలో అయ్యేవాడు. మధ్యలో ఏమైందో ఏమో గానీ రామ్ చరణ్‌ను కూడా అన్ ఫాలో చేశాడు. అలా కొన్ని రోజులు ఎవరిని ఫాలో అవ్వకుండా సైలెంట్ ఉన్న చిరు... ఇప్పుడు తాజాగా మరో వ్యక్తిని ఫాలో అవుతున్నాడు.

అతను ఎవరో కాదు సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.. ఈ విషయాన్నీ ఓ అభిమాని రామజోగయ్య శాస్త్రికి తెలియపరిచాడు. దీనితో రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ అయ్యారు." మీరు చూపిస్తున్న ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.. కొండంత సంతోషంగా ఉన్నాను" అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో లాహేలాహే సాంగ్‌ ను రామ జోగయ్య శాస్త్రి రాశారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story