chiranjeevi : చిన్నారి చేసిన పనికి ముగ్ధుడైన మెగాస్టార్..!
chiranjeevi : కరోనా సోకి ఆక్సిజన్ అందాకా చాలా మంది చనిపోతున్నారు. అలా ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. అయితే ఓ చిన్నారి తన పుట్టినరోజు కోసం దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది.
ఈ విషయాన్నీ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "పి.శ్రీనివాస్, హరిణి దంపతుల కూతురు అన్షి ప్రభాల.. తన పుట్టినరోజు కోసం దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చింది. తన చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరమని ఆ చిన్నారి అంటోంది. ఆమె మంచి మనసుకు ఆమె వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకి నేను ముగ్దుడిని అయ్యాను. అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది.
నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. భగవంతుడు ఈ చిన్నారికి ఆశీస్సులను అందిస్తున్నాడని భావిస్తున్నాను" మెగాస్టార్ తెలిపారు.
What a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com