ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లతో ఆడిపాడిన ఏకైక హీరో..!

ఈ  ముగ్గురు అక్కాచెల్లెల్లతో ఆడిపాడిన ఏకైక హీరో..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అక్కాచెల్లెల్లు హీరోయిన్ లుగా ఉన్నారు. కానీ సక్సెస్ ని చూసింది మాత్రం చాలా తక్కువేనని చెప్పా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అక్కాచెల్లెల్లు హీరోయిన్ లుగా ఉన్నారు. కానీ సక్సెస్ ని చూసింది మాత్రం చాలా తక్కువేనని చెప్పాలి. ఆ తక్కువ మందిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నగ్మా, రోషిణి, జ్యోతిక... ఇందులో నగ్మా మొదటగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత రోషిణి హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చింది. హీరోయిన్ గా రోషిణి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి ఫేం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత జ్యోతిక హీరోయిన్ గా పరిచయం అయి తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలో నటించి మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లతో ఆడిపాడి ఓ రేర్ ఫీట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఘరానా మొగుడుతో పాటుగా పలు సినిమాలలో నగ్మా తో కలిసి నటించాడు చిరు. ఇక రోషిణితో కలిసి మాస్టర్ అనే సినిమాని చేశారు. అటు జ్యోతికతో ఠాగూర్ సినిమాలో జోడి కట్టారు చిరంజీవి.

Tags

Read MoreRead Less
Next Story