Chiranjeevi : శివశంకర్‌ మాస్టర్‌కు మెగాస్టార్‌ సాయం.. మూడు లక్షల రూపాయల చెక్కును..!

Chiranjeevi : శివశంకర్‌ మాస్టర్‌కు మెగాస్టార్‌ సాయం.. మూడు లక్షల రూపాయల చెక్కును..!
Chiranjeevi : ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్‌ కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్‌ కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. మరోపక్కా ఆయన భార్యకు కూడా కరోనా వైరస్‌ సోకడంతో ఆమె హోం క్వారంటైన్‌ అయ్యారు.

ఇక ఆయన పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు అధికం అవ్వడంతో దాతలు ఎవరైనా ముందుకు రావాలంటూ శివశంకర్ మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌ కోరారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి... అజయ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.


కాగా చిరంజీవి చేసిన సాయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటానని అజయ్‌ చెప్పుకొచ్చాడు.


Next Story