'మెగాస్టార్‌'కి కరోనా పాజిటివ్.. 'ఆచార్య' షూటింగ్‌కు బ్రేక్

మెగాస్టార్‌కి కరోనా పాజిటివ్.. ఆచార్య షూటింగ్‌కు బ్రేక్
ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చిరంజీవి ట్వీట్ చేశారు

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది అన్న వార్తల్లో నిజం లేకపోలేదు.. తాజాగా టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చిరంజీవి ట్వీట్ చేశారు.

'ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను.. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను' అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యూనిట్ సభ్యులంతా టెస్ట్ చేయించుకున్నారు. చిరంజీవికి పాజిటివ్ రావడంతో ఇండస్ట్రీ షాకైంది. దీంతో ఆచార్య షూటింగ్ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం చిరంజీవి తమ్ముడు నటుడు నాగబాబు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

Tags

Next Story