Chiranjeevi On NTR : ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు: చిరంజీవి

కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించినట్లు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'కాసేపటి క్రితం తారక్ మాట్లాడా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంబైలో ఉన్నారు. తారక్, కుటుంబసభ్యులందరూ బాగున్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నా. మీపై ఆ దేవుడి దీవెనలు ఉండాలి' అని చిరు ట్వీట్ చేశారు.
అటు తాజాగా ఎన్టీఆర్ తనకి కరోనా సోకినట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.. " ఎలాంటి ఇబ్బంది లేదు. నేను బాగానే ఉన్నాను. నాతో పాటుగా నా కుటుంబం మొత్తం ఐసోలేషన్ లో ఉన్నాం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాం.. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయినవారు దయచేసి టెస్టులు చేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే చిత్రంలో నటిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com