Klin Kaara Konidela: లిల్టిల్ మెగా ప్రిన్సెస్ పేరు ఖరారు

మెగాస్టార్ ఇంట అడుగుపెట్టిన మరో మహాలక్ష్మీ, రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టి అయిన లిట్టిల్ మెగా ప్రిన్సెస్ నామకరణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారి బారసాల మహోత్సవం నిర్వహించారు. అనంతరం పాపాయికి క్లిన్ కారా కొణిదెల అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
లలిత సహస్రనామాల నుంచి ఈ పేరు సంగ్రహించినట్లు వెల్లడించిన చిరు, క్లిన్ కారా ప్రకృతి మాతకు నిదర్శనమని వివరించారు. ఆదిపరాశక్తి ఆపూర్వ శక్తి సామర్థ్యాలకు ప్రతీక అని తెలిపారు. ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉందని వెల్లడించారు. లిట్టిల్ మెగా ప్రిన్సెల్ ఈ సులక్షణాలన్నింటినీ సంగ్రహించుకుని దివ్యమైన వ్యక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు మెగాస్టార్ తాతయ్య తన సంతోషాన్ని అశేషమైన అభిమానులతో పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com