Meghana Raj : అభిమానులకి గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మేఘనా రాజ్

Meghana Raj : కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను మళ్ళీ నటించబోతున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా పన్నగ భరణ, నూతన దర్శకుడు విశాల్‌తో చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘనదే కీ రోల్ కావడం విశేషం.
"ఈ రోజు నీ పుట్టిన రోజు, ఇది మన కల... ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు.. మన కలని బహుమతిగా ఇచ్చేందుకు ఇంతకంటే మంచి టీం దొరకదు.. " అని వెల్లడించింది. నిర్మాత పన్నగ లేకపోతే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించేదానిని కాదని చెప్పుకొచ్చింది. కాగా.. గతేడాది కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కేవలం 35 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో ఓ హీరో చనిపోవడం కన్నడ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. చిరంజీవి సర్జా మరణించినప్పుడు మేఘన రాజ్ 5 నెలల గర్భవతిగా ఉంది. ఆ తరవాత ఆమె ఓ బాబుకి జన్మనిచ్చింది. అతడినికి జూనియర్ చిరంజీవి సర్జా అని నామకరణం చేసారు.
మేఘన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే.. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా శ్రీకాంత్ హీరోగా వచ్చిన లక్కీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com