మాజీ సీఎం మనవడితో మెహ్రీన్ పెళ్లి..!

కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా .. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 మొదలగు సినిమాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడీ భామ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. ఇంతకీ ఈ భామ పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ను ఆమె పెళ్లాడనుంది.
మార్చ్ 13న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనుంది. అయితే ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం. నిశ్చితార్థం అనంతరం పెళ్లి తేదీ ప్రకటించనున్నారు. ఇక భవ్య బిష్ణోయ్, మెహ్రీన్‌కు కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మెహ్రీన్ సినీ కెరీర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com