స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేతుల మీదుగా "మిస్టేక్" మూవీ మోషన్ పోస్టర్ లాంఛ్
అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మిస్టేక్". సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
BY vamshikrishna19 Sep 2021 11:15 AM GMT

X
vamshikrishna19 Sep 2021 11:15 AM GMT
అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మిస్టేక్". సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఎస్పీ మీడియా హౌస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టేక్ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంఛ్ చేశారు. మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న రకుల్... సినిమా టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సమీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - హరి జాస్తి, సంగీతం - మణి జెన్న, డైలాగ్స్ - శ్రీ హర్ష మండ, ఆర్ట్ - రవి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిధి, నిర్మాత - అభినవ్ సర్ధార్, దర్శకత్వం - సన్నీ కోమలపాటి.
Next Story