సినిమాల్లోకి సినీ నటి రోజా కూతురు... ఆ దర్శకుడితోనే ఎంట్రీ?

సినిమాల్లోకి సినీ నటి రోజా కూతురు... ఆ దర్శకుడితోనే ఎంట్రీ?
వారుసుల సినీ ఎంట్రీ అనేది కొత్తేమి కాదు... ఇప్పటికే చాలా మంది సినీ నటుల కుమారులు, కుమార్తెలు సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్నారు.

వారసుల సినీ ఎంట్రీ అనేది కొత్తేమి కాదు... ఇప్పటికే చాలా మంది సినీ నటుల కుమారులు, కుమార్తెలు సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అందులో భాగంగా సినీ నటిగా, రాజకీయ నాయకురాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రోజా.. తన కూతురైన అన్షు మాలికను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నారట.. త్వరలో అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట.. ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతుందట. అయితే అన్షు మాలికను ఓ సీనియర్ రొమాంటిక్ డైరెక్టర్ లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడు రోజాతో కూడా కొన్ని సినిమాలను కూడా చేశాడు. దీనిపైన త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది. కాగా అన్షు మాలిక బర్త్ డే ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా వైరల్ అయిన సంగతి తెలిసిందే..!

Tags

Read MoreRead Less
Next Story