MLC Kavitha : అవన్నీ అవాస్తవాలు.. నాకు ఈడీ నోటీసులు అందలేదు : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : అవన్నీ అవాస్తవాలు.. నాకు ఈడీ నోటీసులు అందలేదు : ఎమ్మెల్సీ కవిత
X
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ తనకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ తనకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టంచేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ట్వీట్‌ చేశారు. కొంత మంది ఢిల్లీలో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో హైదరాబాద్‌ లింక్‌లపై ఈ ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్టర్‌ ద్వారా స్పందించారు.


Tags

Next Story