టాలీవుడ్

Mohan Babu: తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్న మోహన్‌బాబు.. తనతో పాటు విష్ణు, మనోజ్ కూడా..

Mohan Babu: రేపు తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్నారు సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు.

Mohan Babu: తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్న మోహన్‌బాబు.. తనతో పాటు విష్ణు, మనోజ్ కూడా..
X

Mohan Babu: రేపు తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్నారు సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు. ఆయనతోపాటు శ్రీ విద్యానికేతన్‌ డైరెక్టర్లుగా ఉన్న కుమారులు విష్ణు, మనోజ్‌ కూడా విచారణకు హాజరవుతున్నారు. 2019 మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల కోసం శ్రీవిద్యానికేతన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

ఇది కోడ్ ఉల్లంఘనే అంటూ చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 మార్చి 22న కేసు పెట్టారు. దీనిపై విచారణ కూడా జరిగింది. ఇప్పుడీ వ్యవహారంపై కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. A-1 నుంచి A-5 వరకూ నేరానికి పాల్పడ్డారంటూ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా రేపు తిరుపతిలోని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందుకు మంచు మోహన్‌బాబు, ఇద్దరు కుమారులు హాజరుకానున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES