Mohan Babu on Balakrishna: బాలయ్య పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోలేదు : మోహన్ బాబు
Mohan Babu on Balakrishna: మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఇవాళ తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు.. బాలకృష్ణను కలిసి ఆయనతో కాసేపు మాట్లాడారు.. విష్ణుకు ఓటు వేసినందుకు మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకుండా తన బిడ్డకు బాలకృష్ణ మద్దతిచ్చారని చెప్పారు. తన బిడ్డకు ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే బాలకృష్ణ ఇంటికి వచ్చినట్లు మోహన్‌బాబు తెలిపారు.బాలకృష్ణను కలిసిన తర్వాత మంచు విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు.. త్వరలోనే చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు. మా అభివృద్ధి కోసం పెద్దలందరినీ కలుస్తానని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com