Mohan Babu: 'భయం భయంగా ఉంది'.. మోహన్ బాబు ట్వీట్

Mohan Babu: భయం భయంగా ఉంది.. మోహన్ బాబు ట్వీట్
Mohan Babu: మంచు మోహన్ బాబు.. అటు పూర్తిగా సినిమాలకు దూరమవ్వలేదు. అలా అని వెంటవెంటనే సినిమాలు కూడా చేయడం లేదు.

Mohan Babu: సీనియర్ నటులైనా, యంగ్ నటులైనా తమరికి అనిపించింది ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకోవడమే ఇప్పటి ట్రెండ్. అంతే కాకుండా తమ సినిమా విశేషాలకు హైప్ తీసుకురావాలంటే సోషల్ మీడియానే బెస్ట్ అని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. తాజాగా మోహన్ బాబు కూడా తన అప్‌కమింగ్ సినిమా ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

మంచు మోహన్ బాబు.. అటు పూర్తిగా సినిమాలకు దూరమవ్వలేదు. అలా అని వెంటవెంటనే సినిమాలు కూడా చేయడం లేదు. నచ్చిన కథ వస్తే లీడ్ రోల్ కూడా చేయడానికి వెనకాడని మోహన్ బాబు.. ప్రస్తుతం 'అగ్నినక్షత్రం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మోహన్ బాబుతో పాటు ఆయన వారసురాలు మంచు లక్ష్మి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

అగ్నినక్షత్రం చిత్రంలో మంచు లక్ష్మి నటించడమే కాకుండా నిర్మిస్తోంది కూడా. ప్రతీక్ ప్రజోష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇటీవల అగ్నినక్షత్రం చిత్రం నుండి ప్రొఫెసర్ విశ్వామిత్రగా నటిస్తున్న మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అంతే కాకుండా 'భయం భయంగా ఉంది' అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags

Read MoreRead Less
Next Story