Mokshagna: బాలకృష్ణ వారసుడి సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఫిక్స్..

Mokshagna: బాలకృష్ణ వారసుడి సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఫిక్స్..
Mokshagna: ఇప్పటివరకు మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎందరో స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.

Mokshagna: తమ అభిమాన హీరోల వారసుల సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు వారసులుగా వచ్చి ఇండస్ట్రీలో గుర్తింపు సాధించినవారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నందమూరి వారసుడు లాంచ్‌కు టైమ్ వచ్చేసినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అయ్యారట. అంతే కాకుండా మోక్షజ్ఞ మొదటి చిత్రానికి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం.

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఇప్పటివి కావు. గత కొంతకాలంగా బాలయ్య నటిస్తున్న ఏదో ఒక సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' నుండి ఇదే తంతు కొనసాగుతోంది. ఇక ఫైనల్‌గా త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వైరల్ అయ్యాయి.

ఇప్పటివరకు మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎందరో స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆఖరికి బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న బోయపాటితోనే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్సే అని తేలిపోయింది. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే మోక్షజ్ఞను ఓ మినిమమ్ గ్యారెంటీ కామెడీ సినిమాతో లాంచ్ చేస్తాడని బాలయ్య భావిస్తున్నాడట. దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇందులో నిజమెంతుందో తెలియదు.

Tags

Read MoreRead Less
Next Story