సునీత పెళ్లిపై ట్రోల్స్.. కత్తి మహేష్ పంచ్

సునీత పెళ్లిపై ట్రోల్స్.. కత్తి మహేష్ పంచ్
కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఆమెకు వారి మాటలు ఎంత బాధిస్తాయి. ఎవరి ఇష్టం వాళ్లది ఎవరి జీవితం వారిది..

సునీత పెళ్లి చేసుకోవడం పాపం చాలా మందికి మింగుడు పడట్లేదు. ఆమె ఆనందంగా ఉండడం అస్సలు సహించలేకపోతున్నారు. భర్త వదిలేశాడని బాధపడుతూ కూర్చుంటే సమాజం సంతోషిస్తుంది.. విమర్శించే వాళ్లు కూడా బాగా చదువుకున్నవాళ్లే అయ్యుండడం మన దౌర్భాగ్యం.. విద్యలో ఎదిగినా వ్యక్తిత్వంలో వెనుకబడే ఉన్నారడనడానికి ఇదే నిదర్శనం.

మన అమ్మమ్మా, తాతయ్యలు ఆనాడే ఇలాంటి మార్పుకు శ్రీకారం చుట్టినా అప్పుడు ఏమీ అనిపించలేదు.. టెక్నాలజీని ఓ మంచి మాటకు, ఓ మంచి పనికి వాడుకోవాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు. ఆనందంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఆమెకు వారి మాటలు ఎంత బాధిస్తాయి.

ఎవరి ఇష్టం వాళ్లది ఎవరి జీవితం వారిది.. నీకు వచ్చిన బాధేంటి.. ఆ రాతలేంటి.. నీతల్లో, చెల్లో, అక్కో అలాంటి పొజిషన్‌లో ఉంటే అప్పుడు కూడా మీరిలానే స్పందిస్తారా.. ఆమె ఏదో సంఘ విద్రోహ చర్యకు పాల్పడినట్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. పిల్లలు పెళ్లీడుకు వస్తే ఈ వయసులో పెళ్లి కావలసి వచ్చిందా అని అనకూడని మాటలంటున్నారు.. ఓ మహిళకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా.. 30 ఏళ్లున్న తాతయ్య మొదటి భార్యతో సరిపడక 10 ఏళ్ళ వయసులో ఉన్న నానమ్మని పెళ్లి చేసుకుని 8,10 మంది పిల్లల్ని కంటే కథలుగా చెప్పుకుంటాము.. తాత ఏదో గొప్ప పని చేసినట్టు తాత ఘనకార్యాన్ని వారసులకు అందిస్తాము.

ఆనాడు స్మార్ట్ ఫోన్లు, ఫేస్ బుక్కులూ లేవు కాబట్టి ఇలా ట్రోల్ చేయలేకపోయారని సరిపెట్టుకోవాలా.. సునీత కళ్లలో ఆనందాన్ని, ఆమె సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఆస్తుల కోసమో.. అవసరం కోసమో.. ఓ బాధ్యత కోసమో.. ఓ బంధం కోసమో.. ఓదార్పు కోసమో.. ఏదైనా కావచ్చు.ఇదిలా ఉంటే ఆమెను ఆశీర్వదించేవాళ్లు చాలా మందే న్నారు.

కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ క్రిటిక్ కత్తి మహేష్.. సునీత పెళ్లిపై ఆసక్తికర పోస్ట్ చేశాడు. 'సింగర్ సునీత పెళ్లి చేసుకున్నా మనోభావాలు దెబ్బతీసుకుంటారేంటి ' అంటూ సునీత పెళ్లిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి పంచ్ వేశాడు కత్తి మహేష్.

మరో పోస్ట్‌లో.. 'ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి, ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం.. ఎంత కష్టం. .

ఏదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని.. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!' అంటూ సెటైర్లు వేశాడు కత్తి మహేష్.


ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."?


Tags

Read MoreRead Less
Next Story