టాలీవుడ్

హౌస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్ పరిస్థితి..

తన కామెడీ ద్వారా అభిమానులను సంపాదించుకున్న అవినాష్

హౌస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్ పరిస్థితి..
X

జబర్ధస్త్ నుంచి బిగ్‌బాస్‌కి వచ్చి ఏం సాధించాను.. అని తర్కించుకుంటున్నాడు ముక్కు అవినాష్. ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయింది అన్న చందాన ఉంది అతడి పరిస్థితి.. అతడో కామెడీ హీరో.. జబర్థస్థ్ షోలో తన కామెడీ ద్వారా అభిమానులను సంపాదించుకున్న అవినాష్ టీమ్‌ లీడర్ స్థాయికి ఎదిగాడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించి అందర్నీ నవ్వించాలనుకున్నాడు.. కానీ ఆ నవ్వులు కొన్ని రోజులే వర్కవుట్ అయ్యాయి..

గేమ్‌ని సీరియస్‌గా ఆడే ఇంటి సభ్యులకు అవినాష్ కామెడీ రాను రానూ సిల్లీగా అనిపించసాగింది.. అదే విషయాన్ని సీరియస్‌గా చెప్పాడు అభిజిత్. ఇద్దరి మద్య జరిగిన వాగ్వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఎంత కాదనుకున్నా ఎమోషన్స్‌ని ఒక స్థాయి వరకే కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎవరైనా.. ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ఆట వారిదే ఎవరి విజయం వారిదే. గెలుపు కోసం ఎదుటి వారిలో తప్పులు ఎంచే కార్యక్రమం బిగ్‌బాస్ ఆట లక్ష్యంగా కనబడుతోంది..

అమ్మ రాజశేఖర్‌ని ఒక దశలో అందరూ అభిమానించినట్లే కనిపించారు.. కానీ ఆయన తనని పొగిడితేనే ఇష్టపడతారు.. తప్పు పడితే మాత్రం అస్సలు అంగీకరించరు అని దాదాపు ఇంటి సభ్యులంతా అనే స్థాయికి వచ్చారు. అభిజిత, అమ్మ గొడవపడుతుంటే కాకి గోలగా అనిపించి, వీళ్ల గొడవ మనకి అవసరమా అని ప్రేక్షకులు అనుకోవాల్సి వచ్చింది.. అవినాష్ పరిస్థితీ అంతే.. అతనిలో కామెడీ తగ్గి సీరియస్‌గా మారిపోయాడు.. ఇంటి సభ్యుల మీద ఫైర్ అవుతున్నాడు..

అసలే నాకు పెళ్లి ఎలా అవుతుందో.. ఇది చూసి నాకు పిల్లనెవరైనా ఇస్తారా అని బాధపడిపోతున్న అవినాష్‌కి బయటకు వచ్చిన తరువాత అవకాశాలు వస్తాయా లేదా అని కూడా ఆందోళన చెందుతున్నాడు.. సోహెల్‌తో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు.. బిగ్‌బాస్‌కి వచ్చి ఇమేజ్ పెంచుకున్న వాళ్లు కొందరైతే, ఉన్న ఇమేజ్‌ని పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు.. మరి అవినాష్ పరిస్థితి ఏంటో. అసలే ఇంటికి ఈఎమ్‌ఐ కడుతున్నాను అని ఇంటి సభ్యుల దగ్గర ప్రస్తావించాడు.

Next Story

RELATED STORIES