క్యాబ్‌ డ్రైవర్‌ టచ్‌ చేయడానికి ప్రయత్నించాడు : ముమైత్‌

క్యాబ్‌ డ్రైవర్‌ టచ్‌ చేయడానికి ప్రయత్నించాడు : ముమైత్‌

గోవా ట్రిప్‌లో క్యాబ్‌ డ్రైవర్‌ వేధించారంటూ.. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు ఐటం గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌. అయితే ముమైత్‌ ఖాన్‌ చేతిలో తాను మోసపోయాను అంటూ సదరు క్యాబ్‌ డ్రైవర్‌ నిన్న మీడియా ముందుకు వచ్చాడు. తన క్యాబ్‌లో గోవా టూర్‌ వెళ్లొచ్చిన ఆమె.. 15 వేల రూపాయల బాకీ పడిందని రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ ఆరోపించాడు. ఐతే.. క్యాబ్‌ డ్రైవర్‌ రాజే తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ముమైత్‌ ఖాన్. కారు ఎక్కిన దగ్గర నుంచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. కావాలని టచ్‌ చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపిస్తున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో మధ్యలో హడలెత్తేలా చేశాడని.. వెంటనే డ్రైవర్‌ పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story