Murali Mohan: 'ఎప్పుడూ సరదాగా ఉండేవారు'.. చై, సామ్ విడాకులపై నటుడి వ్యాఖ్యలు

Murali Mohan: టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం. తెలుగులోని క్యూట్ కపుల్స్‌లో ఒకరైన వీరు విడిపోతున్న విషయం తమ ఫ్యాన్స్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ విడాకుల గురించి వెల్లడించిన తర్వాత వీరిద్దరూ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. వీరు మాత్రమే కాదు వీరి సన్నిహితులు కూడా ఏ విషయం బయటపెట్టలేదు. తాజాగా నటుడు మురళీ మోహన్.. సామ్, చైల అనుబంధం గురించి వివరించారు.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మురళీ మోహన్‌కు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులోనే తన కుటుంబం కోసం ప్రత్యేకంగా మూడు ఫ్లాట్స్ డిజైన్ చేయించారు. అయితే అందులో ఒక ఫ్లాట్ నాగచైతన్యకు బాగా నచ్చడంతో మురళీ మోహన్‌ను అడిగాడు. కానీ తన కుటుంబం కోసం ప్రత్యేకంగా కట్టుకున్న ఫ్లాట్స్ కావడంతో మురళీ మోహన్ అమ్మనని చెప్పారు. కొన్నిరోజుల తర్వాత నాగార్జున జోక్యంతో ఆ ఫ్లాట్ నాగచైతన్య సొంతమయ్యింది.
పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత తమ ఫ్లాట్‌లోనే ఉండేవారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. చై, సామ్ వాకింగ్, వర్కౌట్స్ అన్నీ కలిసి చేసేవారని, చాలా సరదాగా కనిపించేవారని అన్నారు. తనకు తెలిసినంత వరకు వాళ్లెప్పుడూ గొడవపడలేదని, వాగ్వాదాలు పెట్టుకోలేదని అన్నారు. పార్టీలు లాంటివి ఏమీ లేకుండా ఆ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేదని వివరించారు.
చై, సామ్ విడాకుల విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసిందని అన్నారు మురళీ మోహన్. తమ ఇంట్లో పనిచేసేవారు చై, సామ్ విడిపోయారని, చైతూ సామాన్లు అన్నీ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడని చెప్పారని తెలిపారు. ఆ విషయం తనను షాక్‌కు గురిచేసిందని వెల్లడించారు. ఒకవేళ తనకు ఈ విషయం ముందే తెలిసుంటే వారిద్దరితో మాట్లాడేవాడినని బయటపెట్టారు మురళీ మోహన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com