మహేష్‌‌బాబుకి పాటలు పాడి తప్పు చేశాను : ఆర్పీ పట్నాయక్

మహేష్‌‌బాబుకి పాటలు పాడి తప్పు చేశాను : ఆర్పీ పట్నాయక్
సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఆర్పీ పట్నాయక్ ఒకరు.

సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఆర్పీ పట్నాయక్ ఒకరు. చిత్రం సినిమాతో మొదలైన ఆర్పీ సినీ ప్రయాణం.. ఆ తర్వాత నువ్వు నేను, జయం, మనసంతా నువ్వు, నీ స్నేహం, సంతోషం లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్లు ఆయన ఖాతాల్లో ఉన్నాయి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా.. సింగర్‌‌గా కూడా శ్రోతలను మెప్పించారు ఆర్పీ.. కెరీర్ పరంగా పీక్స్‌‌లో ఉన్న సమయంలో సడన్‌‌గా సినిమాలకి మ్యూజిక్ చేయడం ఆపేశారయన.

ఆ తరవాత నటుడిగా, దర్శకుడిగా సినిమాలు చేశారు. ఇదిలా ఉండగా ఓ స్టార్ హీరో సినిమాకి పాటలు పాడి తప్పుచేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆర్పీ. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు.. మహేష్‌‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. కులశేఖర సింగల్ కార్డ్ లో పాటలు రాశారు. ఇందులో మొత్తం పది పాటలుండగా ఏడు పాటలు ఆర్పీనే పాడారు. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో సినిమా పరాజయం పాలైంది.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్పీ.. ఈ సినిమాలో పాటలు పాడి తప్పు చేశానని, కానీ అప్పటికి ఉన్న పరిస్థితుల్లో తప్పలేదని వెల్లడించారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి తన వాయిస్ సరిపోలేదని ఆర్పీ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తానూ రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత సినిమాల్లో పాటలు పాడడం ఆపేయాలని చాలా మంది చెప్పారని ఆర్పీ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story