Mythili: సొంత భర్తే నన్ను మోసం చేసాడు, రెండేళ్లుగా.. : మైథిలీ

Mythili: ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ ఆర్టిస్ట్ మైథిలి కోలుకుంటోంది. తాను ఈ పరిస్థితికి రావడానికి కారణమైన తన భర్తను శిక్షించాలని కోరుతోంది. సొంత ఇంట్లోనే 65 తులాల బంగారం దొంగతనం చేసిన భర్త అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటోంది. వేరే అమ్మాయితో రిలేషన్ విషయంలోనూ తమ మధ్య గొడవలు జరిగాయంది. తనను దారుణంగా హింసించాడంటూ చెప్పుకొచ్చింది. పంజాగుట్ట పోలీసులు కూడా తాను కేసు పెట్టినా పట్టించుకోకపోవడంతో ఏళ్ల తరబడి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసానంటోంది.
మైథిలి సూసైడ్ యత్నం చేసేముందు పంజాగుట్ట పోలీసులకు లైవ్ కాల్ చేసింది. వెంటనే విషం తాగింది. పోలీసులు అలర్టై అమీర్‌పేట సమీపంలో ఆమె ఉంటున్న ఇంటికి చేరుకుని వెంటనే నిమ్స్‌కు తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. రెండేళ్లుగా తన భర్త పెడుతున్న టార్చర్ తట్టుకోలేకపోతున్నానంటోంది మైథిలి. 13 లక్షల కట్నం, 65 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఇంకా అదనపు కట్నం కోసం తనను వేధించాడని మైథిలి ఆరోపించింది. 2021లోనే గృహహింస కేసు పెట్టిన విషయం చెప్తోంది. తాను ఈ పరిస్థితికి రావడానికి కారణమైన తన భర్తతోపాటు అతనికి సహకరించిన వాళ్లందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com