'మా' ఎన్నికల్లో ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారు: నాగబాబు కీలక వ్యాఖ్యలు..!

Naga Babu comments : 'మా' ఎన్నికలపై నాగబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విష్ణు ప్యానెల్ ప్రచారంపైనా సెటైర్లు వేశారు.. మాటమాటకీ ప్రెస్‌మీట్లు పెట్టి హడావిడి చేస్తున్నారంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.. మా ఎన్నికలు ఒక సంస్థకు సంబంధించిన విషయమని.. అందరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందంటూ హితవు పలికారు.. ఇక ఈ ఎపిసోడ్‌లో శ్రీకృష్ణ పాత్రధారి ఎవరూ అందరికీ తెలుసునంటూ నరేష్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు నాగబాబు. మా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ నాగబాబు ఆరోపించారు. ఇక ప్రకాశ్‌రాజ్ భారతీయనటుడని, ఆయన తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటరని ప్రశ్నించారు. చిన్న, పెద్ద సినిమా ఏదైనా వాళ్లకు ప్రకాశ్‌రాజ్ కావాలని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com