బాలీవుడ్‌లోకి నాగబాబు... ఆ హీరోకి విలన్‌గా.. !

మెగా బ్రదర్ నాగబాబు రూట్ మార్చేశారు. కొత్త లుక్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారయన... ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్‌తో విలన్ గేటప్‌లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు నాగబాబు కొత్త లుక్ పైన నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ కొత్త లుక్ బాలీవుడ్ ఎంట్రీ కోసమేనని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రీమేక్ కి వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నాగబాబుని సంప్రదించారట మేకర్స్.. పాత్ర చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com