Naga Babu on Maa Elections : 'మా' ఎన్నికల ముందు బాంబ్ పేల్చిన నాగబాబు.. ఆయన పై అనుమానాలంటూ..!

Naga Babu on Maa Elections : మరికొన్ని గంటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ టైంలో పెద్ద బాంబ్ పేల్చారు మెగా బ్రదర్ నాగబాబు.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు.. అతడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు నాగబాబు.. ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్... మోహన్ బాబుకి బంధువు అవుతారని సమాచారం వచ్చిందని.. అతను విష్ణుకి ఫేవర్‌గా ఉంటాడని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమకి కొత్త ఎన్నికల అధికారి కావాలని పేర్కొన్నారు. కాగా రేపు ఉదయం ఎనిమిది గంటలకి పోలింగ్ జరగనుండగా రాత్రి ఫలితాలు రానున్నాయి. అధ్యక్ష పదవికి విష్ణు మంచు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com