Naga Chaitanya Remuneration: 'థాంక్యూ' కోసం రెమ్యునరేషన్ పెంచేసిన చైతూ.. ఎంతంటే..?

Naga Chaitanya Remuneration: హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంటుంది. హీరో అయినా, హీరోయిన్ అయినా.. వారు చేస్తున్న సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నాయంటే రెమ్యునరేషన్‌ను కచ్చితంగా పెంచే ఆలోచనలో ఉంటారు. అయితే యువ హీరో నాగచైతన్య కూడా తన ముందు సినిమాలకంటే 'థాంక్యూ' కోసం కాస్త ఎక్కువ రెమ్యునరేషనే తీసుకుంటున్నట్టు సమాచారం.
అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ వర్కవుట్ అవ్వకపోవడంతో లవ్ స్టోరీల వైపు అడుగులేశాడు. ఆ లవ్ స్టోరీలే చైతూకు సక్సెస్ తెచ్చిపెట్టాయి. అప్పటినుండి వరుస ప్రేమకథలతో బిజీ అయిపోయాడు చై. ఇక మరోసారి తనకు కలిసొచ్చిన ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'థాంక్యూ'.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన చిత్రమే 'థాంక్యూ'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది. అవికా గోర్, మాళవికా నాయర్, రాశి ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు. అయితే థాంక్యూలో నటించడం కోసం నాగచైతన్య రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలకు రూ.6 కోట్లు పారితోషికంగా అందుకున్న చైతూ.. థాంక్యూ కోసం ఏకంగా రూ.4 కోట్లు పెంచేశాడని టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com