Naga chaitanya: తన ఫస్ట్ లవ్‌పై నోరువిప్పిన చైతూ.. కాలేజీ రోజుల్లోనే..

Naga chaitanya: తన ఫస్ట్ లవ్‌పై నోరువిప్పిన చైతూ.. కాలేజీ రోజుల్లోనే..
X
Naga chaitanya: థాంక్యూ ప్రమోషన్ కార్యక్రమంలో తనకు కాలేజీ రోజుల్లో ఓ ప్రేమకథ ఉండేదన్న విషయాన్ని బయటపెట్టాడు చైతూ.

Naga chaitanya: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. కెరీర్ మొదట్లో కాస్త తడబడినా.. వరుసగా ప్రేమకథలను ఎంచుకొని హిట్లు అందుకున్నాడు. ఆ తర్వాత సమంతతో ప్రేమ, పెళ్లి అన్ని చకచకా జరిగిపోయాయి. తన పర్సనల్ విషయాలను ఎక్కువగా బయటపెట్టని చైతూ లైఫ్.. విడాకుల తర్వాత హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవల సమంతకంటే ముందు తనకు ఉన్న ఫస్ట్ లైఫ్ గురించి బయటపెట్టాడు చైతూ.

అక్కినేని ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి నాగచైతన్య చేస్తున్న చిత్రమే 'థాంక్యూ'. ఈ సినిమా జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ మూవీని జులై 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా.. ప్రమోషన్స్‌కు సమయం సరిపోదు అన్న ఉద్దేశ్యంతో 22కు మార్చారు. ఇటీవల ఈ మూవీలో ఓ పాట రిలీజ్ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీకి వెళ్లింది మూవీ థాంక్యూ టీమ్.

ఈ ప్రమోషన్ కార్యక్రమంలో తనకు కాలేజీ రోజుల్లో ఓ ప్రేమకథ ఉండేదన్న విషయాన్ని బయటపెట్టాడు నాగచైతన్య. కాలేజీ రోజులు అనేవి బాగుంటాయని, ఇప్పుడు బోర్‌గా అనిపించినా.. తర్వాత వాటి విలువ ఏమిటో తెలుస్తుందని చెప్పాడు చైతూ. తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తన కెరీర్‌ను ప్రారంభించాలి? ఎప్పుడెప్పుడు తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అని ఎదురుచూసేవాడని తెలిపాడు. చైతూ తన ఫస్ట్ లవ్ గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడడం ప్రేక్షకులకు షాక్‌కు గురిచేస్తోంది.

Tags

Next Story