టాలీవుడ్

Naga Chaitanya: తన టాటూతో సామ్‌కు ఉన్న కనెక్షన్ అదేనట..! బయటపెట్టిన చైతూ

Naga Chaitanya: నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్నప్పుడే వీరిద్దరూ ఓ కపుల్ టాటూను వేయించుకున్నారు.

Naga Chaitanya: తన టాటూతో సామ్‌కు ఉన్న కనెక్షన్ అదేనట..! బయటపెట్టిన చైతూ
X

Naga Chaitanya: ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా క్యూట్ కపుల్ అనిపించుకున్నారు నాగచైతన్య, సమంత. అందుకే ఈ కపుల్‌కు చాలామందే ఫ్యాన్స్ అయ్యారు. వీరు విడిపోయినప్పుడు కూడా అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ ప్రస్తుతం సమంత, నాగచైతన్య గతాన్ని మర్చిపోయి కెరీర్‌లో ముందుకెళ్తున్నారు. తాజాగా తన టాటూ గురించి మొదటిసారి బయటపెట్టాడు చైతూ.

నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్నప్పుడే వీరిద్దరూ ఓ కపుల్ టాటూను వేయించుకున్నారు. కుడి చేతిపై ఇద్దరికీ ఒకే చోట ఈ టాటూ ఉంటుంది. తర్వాత ఆ టాటూనే కాస్త పెద్దగా చేయించుకున్నాడు చైతూ. కానీ ఇప్పటివరకు దాని అర్థం ఏంటో ఎవరికీ చెప్పలేదు. ఇటీవల లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ సమయంలో ఆ టాటూకు, సమంతకు ఉన్న కనెక్షన్‌ను బయటపెట్టాడు నాగచైతన్య.

తన కుడి చేతి మీద ఉన్నది వారి పెళ్లి డేట్ అని బయటపెట్టాడు చైతూ. తను అలా టాటూ వేయించుకున్నాడు కానీ తన ఫ్యాన్స్ ఎవరూ అలా చేయొద్దని సలహా ఇచ్చాడు. అంతే కాకుండా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఏదైనా ఎప్పుడైనా మారవచ్చని అన్నాడు. అయితే తనకు టాటూ మార్చుకునే ఉద్దేశ్యం ఉందా అడగగా.. 'నేను దాని గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. అయినా మార్చడానికి ఏముంది ఇది ఫైన్' అని సమాధానం ఇచ్చాడు నాగచైతన్య

Next Story

RELATED STORIES