Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..

Naga Chaitanya: సినీ సెలబ్రిటీలు ఇద్దరు వివాహం చేసుకొని విడిపోయినా కూడా కలిసే సందర్భాలు ఎన్నో వస్తుంటాయి. ఒకే ఫీల్డ్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకరికి ఒకరు ఎదురవ్వడం సహజం. ఇక సమంత, నాగచైతన్య తమ విడాకులను ప్రకటించిన తర్వాత మాత్రం ఒకరికి ఒకరు ఎదురయ్యే సందర్భాలు ఇప్పటివరకు అయితే రాలేదు. కానీ అలా జరిగితే ఏం చేస్తారు అనే ప్రశ్నకు చైతూ ఇటీవల సమాధానమిచ్చాడు.
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా క్యూట్ కపుల్ అనిపించుకున్నారు నాగచైతన్య, సమంత. అందుకే ఈ కపుల్‌కు చాలామందే ఫ్యాన్స్ అయ్యారు. వీరు విడిపోయినప్పుడు కూడా అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ ప్రస్తుతం సమంత, నాగచైతన్య గతాన్ని మర్చిపోయి కెరీర్‌లో ముందుకెళ్తున్నారు. కానీ ఒకవేళ వీరు మళ్లీ ఎదురవ్వాల్సిన సందర్భం వస్తే ఏం జరుగుతుంది.
ఇప్పటికే నాగచైతన్య.. మళ్లీ సమంతతో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు పూర్తిగా నో అని చెప్పలేదు. ఇక తాజాగా మళ్లీ సామ్ మీకు ఎదురయితే ఏం చేస్తారు అంటే హాయి చెప్తాను అన్నాడు చైతూ. అంతే కాకుండా ఫ్రెండ్లీగా హగ్ కూడా ఇస్తాను అన్నాడు. దీంతో చైతూ ఇప్పుడిప్పుడే తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడంలో సౌకర్యంగా ఫీల్ అవుతున్నాడని అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com