Naga Chaitanya: నెపోటిజంపై నోరువిప్పిన నాగచైతన్య..

Naga Chaitanya: బాలీవుడ్‌లో మరోసారి నెపోటిజం సెగ రగులుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా ప్రతీ సినిమాను ప్రేక్షకులు బాయ్‌కాట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో విడుదలయిన సినిమాలు ఏవీ కనీస కలెక్షన్లు రాబట్టలేక థియేటర్ల నుండి వెనక్కి తగ్గాయి. దీంతో హీరోలకు, దర్శక నిర్మాతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా నెపోటిజంపై స్పందించాడు.
'సౌత్‌లో ఇది అంతగా జరగదు. అయినా ఇది ఎందుకు ప్రారంభమవుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను మా తాత యాక్ట్ చేయడం చూశాను, మా నాన్న యాక్ట్ చేయడం చూశాను. వారు వాళ్లని స్ఫూర్తిగా తీసుకొని యాక్టర్ అయ్యాను. ఒకవేళ ఎప్పుడైనా ఓ సెల్ఫ్ మేడ్ స్టార్ సినిమా, నా సినిమా ఒకేరోజు విడుదలయితే.. వారి సినిమా రూ.100 కోట్లు సాధిస్తే.. నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే.. అందరూ తనను ప్రశంసిస్తారు. తనవెంట పడతారు.' అన్నాడు చైతూ.
సినిమా ఫ్యామిలీ నుండి రావడం వల్ల తనకు బ్రేక్ ఈజీగానే దొరికిందని ఒప్పుకున్న నాగచైతన్య.. సినీ పరిశ్రమలోని పోటీ గురించి మాట్లాడాడు. 'ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కొడుకు రేపు పెద్దయ్యాక నేను హీరో అవుతా అంటే తను కూడా అడ్డుచెప్పగలడా ఇది నెపోటిజం అని చెప్పి' అని సింపుల్‌గా ఓ ప్రశ్నకు ఈ నెపోటిజంకు సమాధానం ఇచ్చాడు చైతన్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com