Naga Chaitanya: శోభితాతో డేటింగ్.. స్పందించిన నాగచైతన్య..

Naga Chaitanya: సినీ పరిశ్రమలో విడాకులు అనేవి చాలా కామన్‌గా జరిగేవే. కానీ టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన విడాకులు మాత్రం సమంత, నాగచైతన్యవే. వీరిద్దరు విడిపోతున్నారని ప్రకటించిన తర్వాత కొంతకాలం పాటు ఈ విషయమే ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా నడిచింది. అసలు వీరు ఎందుకు విడిపోయారు అనే దగ్గర నుండి వీరిప్పుడు ఎవరితో అయినా రిలేషన్‌లో ఉన్నారా అనేవరకు అన్నింటి గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఇక ఇటీవల ఈ వార్తలపై నాగచైతన్య స్పందించాడు.
నాగచైతన్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. అందుకే తన పర్సనల్ విషయాలు కూడా పెద్దగా బయటికి రావు. ఇప్పటివరకు సమంతతో విడాకుల విషయంపై కూడా చైతూ స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడిప్పుడే తను కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి వెనకాడడం లేదు. తాజాగా ఓ హిందీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర ప్రశ్నలను ఎదుర్కున్నాడు చైతూ.
నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చడ్డా' విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఆ సమయంలోనే శోభితాతో డేటింగ్ గురించి నాగచైతన్యకు ప్రశ్న ఎదురయ్యింది. అయితే ఆ ప్రశ్నకు చైతూ నేరుగా నో అన్న సమాధానం చెప్పలేదు. నవ్వి వదిలేశాడు. మౌనం అర్థాంగికారం అన్నట్టుగా చైతూ నవ్వు వెనకాల అర్థమేంటి అని నెటిజన్లు అయోమయంలో పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com