Naga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అన్న సినిమా..

Naga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అన్న సినిమా..
Naga Chaitanya: ఫ్యామిలీలోని ఓ హీరోతో హిట్ సినిమా తీస్తే.. మరో హీరో కూడా ఆ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు.

Naga Chaitanya: ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఒక డైరెక్టర్ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే ఒక సూపర్ హిట్ సినిమా పడితే చాలు.. ఆ హిట్ అయిన సినిమానే తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. అదే విధంగా ఫ్యామిలీలోని ఓ హీరోతో హిట్ సినిమా తీస్తే.. మరో హీరో కూడా ఆ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ప్రస్తుతం అక్కినేని హీరోలు అదే చేస్తున్నారు.

అక్కినేని హీరోలకు ప్రేమకథలు బాగా కలిసొస్తాయి. అందుకే ఎన్ని యాక్షన్ చిత్రాలలో నటించినా.. మళ్లీ లవ్ స్టోరీల వైపే వారి అడుగులు పడుతుంటాయి. అలాగే అఖిల్ కెరీర్‌లో ఓ మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌తో నాగచైతన్య తరువాతి చిత్రం ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్య.. ఓటీటీలో తన గ్రాండ్ డెబ్యూకు సిద్ధమవుతున్నాడు. 'దూత' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అంతే కాకుండా తను నటిస్తున్న 'థాంక్యూ' చిత్రం కూడా చివరిదశకు చేరుకుంది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్‌తో నాగచైతన్య తరువాతి చిత్రం కన్ఫర్మ్ అయిపోయిందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story