నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులు: నాగబాబు

నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులు: నాగబాబు
మరో రెండు రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న శుభ తరుణంలో ఆ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరో రెండు రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న శుభ తరుణంలో ఆ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి. కానీ తండ్రి నాగబాబు పుట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగుపెట్టబోతున్న కూతుర్ని చూసి మురిసిపోతున్నా.. మరోపక్క తన చిట్టితల్లిని విడిచి దూరంగా ఉండాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నారు. భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ట్విట్టర్ వేదికగా తన అన్నా, వదినలతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నిహారికను ఉద్దేశించి కుటుంబం నీకు అన్నీ నేర్పింది. ఒక తండ్రిగా నీకు స్వతంత్రంగా ఎదిగేందుకు రెక్కలు ఇచ్చాను. అవి నిన్ను మరింత ఎత్తుకు తీసుకువెళతాయని ఆశిస్తున్నాను. అలాగే కుటుంబం ఎప్పుడూ నిన్ను సంరక్షిస్తూనే ఉంటుంది. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు నేను అందించే రెండు అద్భుతమైన బహుమతులు ఇవే. లవ్ యూ నిహారిక అని నాగబాబు పోస్ట్ పెట్టారు.

డిసెంబర్ 9న నిహారిక వివాహం ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ హాటల్‌లో జరుగుతోంది. వరుడు చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు. ఇరు కుటుంబాలు పరిమిత అతిధులతో పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తల్లి నిశ్చితార్థ చీరలో నిహారిక పెళ్ళి కుమార్తెగా ముస్తాబై అమ్మానాన్నలను మురిపించింది.

Tags

Read MoreRead Less
Next Story